| Daily భారత్
Logo




పునరుద్ధరించిన పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించిన డీజీపీ

News

Posted on 2026-03-01 13:56:22

Share: Share


పునరుద్ధరించిన పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించిన డీజీపీ

డైలీ భారత్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసి అభివృద్ధి చేసిన పోలీస్ అతిథి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి, IPS ఆదివారం ప్రారంభించారు. ఈ సాయంత్రం హన్మకొండ పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న డిజిపి గారు వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డిజిపి అనంతరం పునరుద్ధరించిన ఆధునిక సదుపాయాలతో రూపొందించిన పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించారు.

పోలీస్ శాఖ అధికారుల, అతిథుల వసతి సౌకర్యాలను మెరుగుపరచే దిశగా ఈ అతిథి గృహం పునర్నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో, సౌకర్యవంతమైన వాతావరణంలో రూపొందించిన ఈ అతిథి గృహం భవిష్యత్‌లో శాఖకు మరింత ఉపయోగకరంగా ఉండనుందని డిజిపి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిషనరేట్‌కు చెందిన డీసీపీలు అంకిత్ కుమార్, కవిత, శుభం నాగ్, అదనపు డీసీపీ లు రవి, శ్రీనివాస్, సురేష్ కుమార్, తో పాటు ఏసీపీలు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >