| Daily భారత్
Logo




బాధితుడి వద్దకే చేరి FIR నమోదు

News

Posted on 2026-03-01 15:13:23

Share: Share


బాధితుడి వద్దకే చేరి FIR నమోదు

ప్రజల భరోసాను బలోపేతం చేస్తున్న కామారెడ్డి జిల్లా పోలీసులు

సంఘటన స్థలంలోనే, ఆస్పత్రిలోనే ఫిర్యాదు స్వీకరణ వేగవంతమైన పోలీస్ సేవలు

బాధితుల ఇబ్బందులను అర్థం చేసుకుని స్పందించడం సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ లక్ష్యం

“పోలీసులు ప్రజల కోసం… బాధితుడికి అండగా నిలవడం మా బాధ్యత” – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS

డైలీ భారత్, కామారెడ్డి: ప్రజలకు మరింత చేరువగా ఉండి, బాధితులకు తక్షణ న్యాయం అందించాలనే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా పోలీసులు ‘సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, పోలీసులు స్వయంగా సంఘటన స్థలానికి లేదా ఆస్పత్రికి చేరుకుని ఫిర్యాదులు స్వీకరించి, అక్కడికక్కడే FIR నమోదు చేసి, FIR కాపీని బాధితులకు అందజేస్తున్నారు.

తాజా ఘటనల వివరాలు

1. గాంధీనగర్ కాలనీలో దొంగతనం – సంఘటన స్థలంలోనే FIR నమోదు

పిర్యాది బుజ్జి స్వామి (తండ్రి: దేవయ్య) గారు, తేది 28.02.2026 సాయంత్రం సుమారు 7:00 గంటలకు తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మాచారెడ్డికి ఫంక్షన్ నిమిత్తం వెళ్లి, ఈరోజు ఉదయం సుమారు 8:00 గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండగా, బీరువాలో దాచిన సుమారు రెండు తులాల బంగారం మరియు కొంత నగదు గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేసినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని, బాధితుడి ఫిర్యాదును అక్కడికక్కడే స్వీకరించి, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్‌లో భాగంగా సంఘటన స్థలంలోనే FIR నమోదు చేసి, FIR కాపీని బాధితుడికి అందజేశారు.

2. వేల్పుగొండ గ్రామంలో ప్రమాదం – ఆస్పత్రిలోనే FIR నమోదు

తేది 28.02.2026 నాడు వేల్పుగొండ గ్రామానికి చెందిన మొగుళ్ళ చిన్న బాలరాజు (58) గారు తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై బయలుదేరిన సమయంలో, సమీపంలో నిర్లక్ష్యంగా తాళం చెవి ఉంచి నిలిపిన ట్రాక్టర్‌ను ఒక చిన్న బాలుడు స్టార్ట్ చేయడంతో ట్రాక్టర్ వెనుకకు కదిలి ఆయనపైకి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్న బాలరాజు కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2:30 గంటలకు మృతి చెందారు.

సమాచారం అందుకున్న మాచారెడ్డి ఎస్సై ఆస్పత్రికి చేరుకుని, మృతుని భార్య నుండి ఫిర్యాదు స్వీకరించి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి, FIR కాపీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ప్రజలకు అండగా నిలుస్తున్న పోలీస్ శాఖ

బాధలో ఉన్న సమయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం చాలా మందికి కష్టసాధ్యం అవుతుంది. అలాంటి సందర్భాల్లో పోలీసులు స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించడం, అక్కడికక్కడే కేసు నమోదు చేయడం వల్ల బాధితులకు తక్షణ న్యాయం ప్రారంభమైన భావన కలుగుతోంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు అసహాయ స్థితిలో ఉన్నవారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా మారింది.

జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో అమలవుతున్న ఈ విధానం ప్రజలలో పోలీసులపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

“బాధితుడు ఎక్కడ ఉన్నా… పోలీస్ సహాయం అక్కడికే చేరాలి” అనే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రజల సేవలో నిబద్ధతతో పనిచేస్తున్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >