| Daily భారత్
Logo




తెలంగాణ ప్రజల సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

News

Posted on 2025-07-18 16:27:43

Share: Share


తెలంగాణ ప్రజల సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

స్నేహ సొసైటీ సిద్దయ్య, స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి లు వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని స్నేహ సొసైటీ సిద్దయ్య, స్నేహ సొసైటీ అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి  అన్నారు. శుక్రవారం నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఆవరణంలో సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మొదట స్నేహ సొసైటీ ఆవరణలో డప్పులతో బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో  అమ్మ వారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆడపడుచులకు తాంబూళం అందజేసి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ స్నేహ సొసైటీ నుండి హౌసింగ్ బోర్డు కాలోనీ పోచమ్మ మందిరానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం, వస్తాలు, నైవేద్యాలు సమర్పించారు.  నిజామాబాద్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం  బోనాల పండగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని అమ్మవారి దయ వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారిలు రాకుండా చూడాలని కోరారు. సమృద్ధిగా వర్షాలు కురిసి సిరిసంపదలతో విరజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగిందని అన్నారు. రైతులు, సైనికుల తో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అందులో మనం ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. బోనాలు కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు, వంశీ ప్రియ, సుచి  ప్రశాంతిలు బోనాలు ఎత్తుకున్నారు.


ఈ కార్యక్రమంలో  మానసిక దివ్యంగుల పాఠశాల ప్రిన్సిపాల్  రాజేశ్వరి  కోఆర్డినేటర్ కిరణ్మయి స్నేహ టీవీ ప్రోగ్రాం మేనేజర్ బాలరాజు ట్రాంజెండర్ల నాయకులు జరీనా, గంగా, శ్యామల, ఆరతి, పాల్గొన్నారు. వీరితోపాటు స్నేహ టి ఐ జిఎన్ఎమ్ కౌన్సిలర్ అవుట్ రీచ్ వర్కర్లు, ఫీల్ ఎడ్యుకేటర్లు, మహిళ సెక్స్ వర్కర్లు పాల్గొన్నారు

Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు

Posted On 2025-12-07 19:45:50

Readmore >
Image 1

చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి

Posted On 2025-12-07 18:39:01

Readmore >
Image 1

ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2025-12-07 18:35:52

Readmore >
Image 1

ఆయా దినపత్రికల స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Posted On 2025-12-07 17:31:39

Readmore >
Image 1

పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Posted On 2025-12-07 17:30:34

Readmore >
Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >