Posted on 2025-07-18 16:29:08
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: వర్ష భావం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వెంటనే ప్రభుత్వం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కలెక్టర్ టీ. వినయ్ కృష్ణ రెడ్డి ని కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షాభావం, సాగునీటి కొరతతో నిజామాబాద్ జిల్లాలో రైతన్నలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. రైతుల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. నిజాంసాగర్ కెనాల్ ద్వారా తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నీరు విడుదల చేయకపోతే.. రైతుల పక్షాన బీజేపీ వారం రోజుల్లో ఆందోళనలు చేపడుతుందన్నారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ప్రతి మండలంలోని రైతులతో కల్సి కలెక్టరేట్ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకార్ లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షలు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు మాస్టర్ శంకర్, పంచారెడ్డి శ్రీధర్, ప్రమోద్, జగన్ రెడ్డి, నారాయణ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు
Posted On 2025-12-09 12:48:45
Readmore >
రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?
Posted On 2025-12-09 11:22:22
Readmore >
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు
Posted On 2025-12-09 11:21:25
Readmore >
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >