Posted on 2026-04-20 11:46:27
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, నంద్యా తండా ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రారంభమైన సంక్షేమ వారంలో జిల్లా కలెక్టర్ అంకిత్ IAS టేకులపల్లి మండలం నంద్యా తండాలోని ఏకలవ్య పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, వారికి అందుతున్న సదుపాయాలు, మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి రోజువారీ శుభ్రత నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థుల ఆరోగ్యానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.
అనంతరం డైనింగ్ హాల్‌ను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండేలా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు.
స్టోర్ రూమ్‌లో ఉంచిన కూరగాయలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. కూరగాయలను నేలపై ఉంచడంపై వార్డెన్‌ను ప్రశ్నించి వెంటనే ర్యాక్‌లు ఏర్పాటు చేసి శుభ్రంగా నిల్వ చేయాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంతో పాటు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆదేశించారు.
ఈ పరిశీలనలో మండల ప్రత్యేక అధికారి శ్రీరామ్, తాసిల్దార్ వీరభద్రం, ప్రిన్సిపల్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #Tekulapalli #EkalavyaSchool #SchoolInspection #MiddayMeal #Hygiene #Telangana
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >