| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చర్ల మండలంలో వరి కోత మిషన్ దహనం

చర్ల మండలంలో వరి కోత మిషన్ దహనం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బోధనెల్లి శివారులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. వరి కోతలు కోస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో వరి కోత మిషన్ మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. సత్యనారాయణపురానికి చెందిన రాంపండు అనే వ్యక్తికి చెందిన ఈ మిషన్ పొలంలో పనిచేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో యంత్రం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంతో రాంపండు అనే వ్యక్తికి భారీగా నష్టం వాటిల్లింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కిందకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది.

Previous మహాత్మ బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహణ
Next ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
ADVERTISEMENT