| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

గుంతలమయంగా మారిన శ్రీనగర్ కాలనీ రోడ్లు... నడవడానికే కష్టం

బొందలుగా మారిన రోడ్లు... అవస్థలు పడుతున్న పాఠశాల పిల్లలు, వృద్ధులు

డైలీ భారత్, సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీవాసులు వర్షపు నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలనీలోని అన్ని వీధుల్లో వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది.

రోడ్లన్నీ గుంతలతో బొందలుగా మారడంతో కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి, రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనివల్ల పాఠశాలలకు వెళ్లే పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు తెలిపారు. 

ఈ సమస్యపై శ్రీనగర్ కాలనీ ప్రజలు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కి మరియు 2వ వార్డు కౌన్సిలర్ వేముల రాములు కి విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే స్పందించి, వర్షపు నీరు నిలిచిన గుంతల్లో మొరం పోయించి రోడ్లను బాగుచేసి, రాకపోకలకు అనుకూలంగా మార్చాలని కోరుతున్నారు.

ఆలస్యం చేయకుండా మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు చేపట్టి శ్రీనగర్ కాలనీ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Previous గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం
Next సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
ADVERTISEMENT