| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

డైలీ భారత్, వేములవాడ/సిరిసిల్ల:  వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి గురువారం పాల్గొన్నారు.

ముందుగా వేములవాడలో బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

అనంతరం సిరిసిల్ల పట్టణంలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.322.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రగుడు జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులతో పాటు బస్ షెల్టర్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం పట్టణంలో ట్రాఫిక్ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని మంత్రులు పేర్కొన్నారు.

Previous హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Next గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం
ADVERTISEMENT