| Daily భారత్
Logo




సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

News

Posted on 2026-07-30 17:09:03

Share: Share


సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

డైలీ భారత్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో ఉన్న బాలసదన్ చిల్డ్రన్స్ హోమ్ నుంచి 29-07-2026 తేదీన తెల్లవారుజామున ఇద్దరు మైనర్ బాలికలు హాస్టల్ ప్రాంగణంలోని ప్రహరీ గోడ దూకి వెళ్లిపోయిన విషయం తెలియగానే,పెద్దపల్లి డీసీపీ శ్రీ రామ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.ఒక బృందాన్ని పెద్దపల్లికి,మరో బృందాన్ని కరీంనగర్‌కు,మరో బృందాన్ని స్థానికంగా సమాచార సేకరణ కోసం,ఇంకో బృందాన్ని బాలికల్లో ఒకరి బంధువుల గ్రామమైన పాలితం ప్రాంతానికి పంపించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, ప్రయాణ మార్గాలు మరియు ఇతర సమాచారాన్ని విశ్లేషించగా,బాలికలు సుల్తానాబాద్ చౌరస్తాకు చేరుకుని అక్కడి నుంచి ఆటోలో పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి,అక్కడి నుంచి రైలులో భువనగిరికి చేరుకుని, అనంతరం బస్సులో నల్గొండకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నల్గొండ బస్టాండ్‌లో ఉన్న ఇద్దరు బాలికలను పోలీసులు తప్పిపోయిన కేవలం 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించి రక్షించారు.అనంతరం వారిని భద్రంగా తీసుకువచ్చి, చట్టపరమైన నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులకు అప్పగించారు.ఈ ఆపరేషన్‌లో సుల్తానాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పొన్నమనేని రంజిత్ రావు,సుల్తానాబాద్ ఎస్‌హెచ్‌ఓ శ్రీ చంద్రకుమార్,హెడ్ కానిస్టేబుళ్లు మహేందర్, కానిస్టేబుళ్లు వెంకటేష్, రవి,రమేష్,అరుణ్, సదానందం,రేణుకతో పాటు టెక్నికల్ టీమ్ సభ్యులు సమన్వయంతో పనిచేసి బాలికలను వేగంగా గుర్తించి రక్షించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా డీసీపీ శ్రీ రామ్ రెడ్డి ఆపరేషన్‌లో పాల్గొన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పొన్నమనేని రంజిత్ రావు,ఎస్‌హెచ్‌ఓ శ్రీ చంద్రకుమార్,పోలీసు సిబ్బంది,టెక్నికల్ టీమ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. వారి సమన్వయం, అప్రమత్తత,సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం వల్లే అతి తక్కువ సమయంలో బాలికలను సురక్షితంగా గుర్తించడం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

ఇంత వేగంగా స్పందించి మైనర్ బాలికలను సురక్షితంగా గుర్తించి రక్షించినందుకు సుల్తానాబాద్ మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు,చైల్డ్ వెల్ఫేర్ విభాగం ప్రతినిధులు,స్థానిక ప్రజలు పోలీసు శాఖను అభినందించారు. చిన్నారుల రక్షణ విషయంలో పోలీసులు చూపిన అంకితభావం, అప్రమత్తత, వేగవంతమైన చర్యలు ప్రశంసనీయమని వారు కొనియాడారు.

గమనిక: మైనర్ బాలికల గోప్యతను పరిరక్షించే చట్టపరమైన నిబంధనల ప్రకారం వారి పేర్లు,ఫోటోలు, చిరునామాలు,ఇతర గుర్తింపు వివరాలను ఉద్దేశపూర్వకంగా వెల్లడించడం లేదు.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >