| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

డైలీ భారత్, కామారెడ్డి : పాఠశాలల్లో హిందీ భాషాభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలతో విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేలా మరింత కృషి చేస్తామని హిందీ ఫోరమ్ అధ్యక్షులు ఇంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి సహేంద్రనాథ్ తెలిపారు

గురువారం శ్రీ సాందీపని కళాశాల కామారెడ్డి లో నిర్వహించిన హిందీ ఫోరమ్ జిల్లా కార్యవర్గ సమావేశం లో  మాట్లాడుతూ హిందీ భాష నిష్ణాతులతో పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు

పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక హిందీ మెటీరియల్ ను అందిస్తామన్నారు 

భాషా నైపుణ్య వికాస కార్యక్రమాలను నిర్వహించి హిందీ భాష విశిష్టత ను తెలియ జేస్తామన్నారు

ఈ కార్యక్రమం లో హిందీ ఫోరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇంద్రశేఖర్  సహేంద్రనాథ్ ముఖ్య సలహాదారులు నార్ల అరుణ్ కుమార్ చింతల లింగం గఫూర్ శిక్షక్ జిల్లా బాధ్యులు పాల్గొన్నారు

Previous ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Next వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ADVERTISEMENT