Posted on 2026-04-20 09:08:37
కాకినాడలో షాకింగ్ ఘటన డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
డైలీ భారత్, కాకినాడ: కాకినాడలో ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధనరాజు, ఈవీఎంల భద్రత విధుల్లో ఉండగానే తన వద్ద ఉన్న 303 రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన ఈవీఎంల నిల్వ కేంద్రం వద్ద డ్యూటీలో ఉన్న సమయంలోనే జరిగింది. గన్ శబ్దం వినిపించడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమై వెంటనే ధనరాజును ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన ధనరాజును తక్షణమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజిహెచ్)కు తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ధనరాజు ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >