Posted on 2026-04-20 14:48:28
మూడు లక్షల విలువ గల ఐదు కేజీల గంజాయి స్వాధీనం.
నిందితులు ఉపయోగించిన కారు బైక్ నాలుగు సెల్ ఫోన్స్ సీజ్.
డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు అరెస్ట్ వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
సోమవారం రోజున నమ్మదగిన సమాచారంపై ఆత్మకూరు గ్రామ శివారులో క్రషర్ మిల్లు వద్ద నలుగు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారం రాగా వెంటనే ఆత్మకూరు పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిని విచారించగా నిమ్మికలకు చెందిన ఏ1 విరబోయిన భరత్ జాజిరెడ్డిగూడెం కొమ్మాల గ్రామానికి చెందిన ఏ2 అరే విజయ్, సూర్యాపేట రూరల్ ఆరెగూడెం గ్రామానికి చెందిన ఏ3 చెవుల మనోజ్, నిమికల్ గ్రామానికి చెందిన ఏ4 కొడిదల శివ గా గుర్తించడం జరిగింది.
వీరిని తనిఖీ చేయగా వీరి వద్ద 5 కేజీల గంజాయి, ఒక కారు, ఒక బైక్, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితులు జలసాలకు విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో గంజాయి వినియోగించే అలవాటు ఉండడం తో గంజాయిని తెచ్చి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం భరత్, విజయ్, మనోజ్ ముగ్గురు కలిసి కొడిదల శివ కు చెందిన మోటార్ సైకిల్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సీలేరు వెళ్లి సీలేరు ఏరియాలో గంజాయిని కొనుగోలు చేసి తెచ్చారు. ఈ కొనుగోలు చేస్తే తెచ్చిన గంజాయిని పంచుకోవడం కోసం నలుగురు ఆత్మకూరు ఎస్ గ్రామ శివారు క్రషర్ మిల్ వద్దకు రావడం జరిగింది. నమ్మదగిన సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్ మండల పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదులుకోకు తీసుకొని వారి నుండి గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది అని ఎస్పీ నరసింహ తెలిపారు. ఇద్దరూ పంచుల సమక్షంలో పంచనమా నిర్వహించి ఐదు కిలోల గాంజాయని మనోజ్ యొక్క కారును, శివ యొక్క బైకును, సెల్ఫోన్లను సీజ్ చేయడం జరిగింది అన్నారు.
పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాలు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ద్వారా గంజాయి నిర్మూలన గంజాయి వినియోగంపై ప్రజలను యువతను చైతన్యవంతం చేస్తున్నామని అయినప్పటికీ ఇలాంటి నిందితుల వల్ల గంజాయి సరఫరా అవుతుందని వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని డ్రగ్స్ గాంజా ఇలాంటి వాటికి అలవాటు పడకూడదని కోరారు. డ్రగ్స్ గంజాయి లాంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని పోలీసువారికి తెలియజేయాలని అన్నారు.
నిందితులను అరెస్టు చేయడంలో బాగా పనిచేసిన సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ను ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్ ను పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు
మీడియా సమావేశం నందు సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆత్మకూరు ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >