| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Misc

శీర్షిక : ఓ మనిషి

శీర్షిక : ఓ మనిషి

డైలీ భారత్, స్పెషల్ శీర్షిక:

 ఓ మనిషి

మంచితనాన్ని మంటకలిపి పైకం వెనకాల పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి కట్టెల పాన్పుపై ఆదమరిచి కనురెప్పలు అర్పి నిద్రపోతున్న  ఓ మనిషి..! 

నీ చివరి అంతిమ యాత్రలో నిన్ను మోయడానికి

 నేను అంటే నేను పోటీపడాలి అలా బ్రతుకు

 ఓ మనిషి..! 

నీ బంధుగణంకోసం, నీ రక్తసంబంధం కోసం,

 నీ వాళ్ళ కోసం కుళ్ళు,కుతంత్రాలు చేసి

 కూడబెట్టిన నీ పైకంపై డేగలా వాలారే తప్ప....

ఒక్కరు కూడా నీ దారిదాపుల్లోకి రాలేదు..!

నీ చివరి అంతిమ యాత్రలో నిన్ను మోయడానికి

 నేను అంటే నేను పోటీపడాలి అలా బ్రతుకు

 ఓ మనిషి..!

సంపాదించు కోవాల్సింది కేవలం ఆస్తి అంతస్తులు

 మాత్రమే కాదు నలుగురు మిత్రులనికూడా అని

 మరవకు ఓ మనిషి..!

నీ చివరి అంతిమ యాత్రలో నిన్ను మోయడానికి

 నేను అంటే నేను పోటీపడాలి అలా బ్రతుకు

 ఓ మనిషి..! 

బందుజనం స్మశానం వరకు వస్తే...,

తలపై రూపాయి నాణెం ఒంటిపై తెల్లని వస్త్రం

నోట్లో గుప్పెడు బియ్యం నీతో కలిసి బూడిద

 అయితాయే తప్ప నీతో కలిసి రావు ఒక్క

 నీ మంచితనం తప్ప అది తెలుసుకో ఓ మనిషి..!

నీ చివరి అంతిమ యాత్రలో నిన్ను మోయడానికి

 నేను అంటే నేను పోటీపడాలి అలా బ్రతుకు

 ఓ మనిషి..! 

నీకు చేతనైతే నలుగురికి సాయంచేయి, కానీ

 కీడుమాత్రం చేయకు ఓ మనిషి..! 

పెన్ను రాయను అని మొరాయిస్తున్న నిష్ణాతులైన

  మహనీయుల,  అనుభవజ్ఞుల మాటలను

 సిరాగా నింపి…. 

జలజల రాలుతున్నా మథురమైన అక్షరాలను

 కవిత రూపంలో మీ ముందు పెట్టాను. తప్పులు

 ఉంటే మంచి మనసుతో మన్నిస్తారని ఆశిస్తూ..

మీ

మంజుల పత్తిపాటి.

మాజీ డైరెక్టర్

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ .

యాదాద్రి భువనగిరి జిల్లా,

తెలంగాణ రాష్ట్రం.

 చరవాణి 9347042218

Previous నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత
Next తెలంగాణ ప్రజల సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
ADVERTISEMENT