| Daily భారత్
Logo




పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం దారుణం

News

Posted on 2025-07-08 14:24:51

Share: Share


పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం దారుణం

ఉన్నత చదువులు చదువుకోవాలన్న విద్యార్థుల కళ కళగానే మిగిలిపోతుంది..

జాగృతి తెలంగాణ నాయకులు,కేర్ కళాశాల అధినేత నరాల సుధాకర్

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు పేద విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు, కేర్ కళాశాల అధినేత నరాల సుధాకర్ విమర్శించారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి అధ్యక్షతన యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చెయ్యకపోవడం వలన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేదని అన్నారు. అలాగే నేటి విద్యార్థులంతా ఆన్లైన్ గేమ్ లకు సోషల్ మీడియాకు బానిస కావద్దని దానివల్ల విద్యార్థి దశలో ఉన్న యువత తమ విలువైన భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. భారతదేశం గర్వించదగా పౌరులుగా ఎదగాలని సూచించారు. అదేవిధంగా యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేస్తూ అనేక సమస్యల్ని పరిష్కరించే రకంగా కృషి చేస్తుందని ఇలాంటి విద్యార్థి సంఘాలలో విద్యార్థులు చేరి సమాజాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. అనంతరం యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి  పెద్ది సూరి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య రంగ బలోపేతానికి, ప్రభుత్వ రంగ సమస్యలను పరిష్కారానికి, ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల దోపిడి అరికట్టడానికి సెప్టెంబర్ నెలలో యూఎస్ఎఫ్ఐ తెలంగాణ మొదటి రాష్ట్ర మహాసభల వేదికపై ఉద్యమ కార్యచరణ రూపొందించుకొని మహనీయులు కోరుకున్న సమసమాజ స్థాపన దిశకై పోరాటాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాదం తిరుపతి, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు వెంకటేష్, రాజేష్, మధు,నాగేష్, తిరుపతి, గణేష్, యుఎస్ఎఫ్ఐ నిజాంబాద్ జిల్లా నాయకులు మహేష్ వేణు గణేష్ బాబురావు శివ, జవహార్,ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >