డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట నూతన ఎస్సైగా సీహెచ్. శ్రీకాంత్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన అనిల్ కుమార్ సిరిసిల్ల సీసీఎస్‌కు బదిలీ కాగా, ఆయన స్థానంలో సిరిసిల్ల టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న శ్రీకాంత్ గంభీరావుపేట ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కడైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంటే తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
News
గంభీరావుపేట నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్