| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న దేవునూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా బదిలీల ఉత్తర్వుల్లో భాగంగా ఈ నియామకం జరిగింది. దేవునూరి శ్రీనివాస్ గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోటారు వాహనాల తనిఖీ అధికారిగా పనిచేశారు. జిల్లాలో రవాణా శాఖకు సంబంధించిన వ్యవహారాలపై ఆయనకు విస్తృత అనుభవం, అవగాహన ఉంది.

ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్‌ను మంచిర్యాల జిల్లాకు మోటారు వాహనాల తనిఖీ అధికారిగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో గతంలో పనిచేసిన అనుభవం ఉన్న దేవునూరి శ్రీనివాస్ జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో శాఖ పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా

Previous జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Next పండగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
ADVERTISEMENT