| Daily భారత్
Logo




పండగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

News

Posted on 2026-06-02 03:04:18

Share: Share


పండగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

జిల్లావ్యాప్తంగా 2,720 ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం.

వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న సామూహిక ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు జరిగాయి. జిల్లాలోని రుద్రంగి, బోయినపల్లి, సిరిసిల్లలో ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,720 ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి.. రుదంగి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. 

లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు.. అలాగే వేములవాడ అర్బన్ మండలం అనుపురం, వేములవాడ పట్టణంలో లాల పల్లె లో ప్రభుత్వ విప్ ప్రారంబించారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్, అలాగే తడగొండ గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు. సిరిసిల్ల లో ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అధికారులతో కలిసి ప్రారంభించారు. 

పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయని నేడు రాష్ట్రంలో సామూహికంగా ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు..రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పీడీ హౌసింగ్ వెంకట మాధవరావు, సీపీఓ శ్రీనివాసాచారి, సిరిసిల్లలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, బోయినపల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మండల ప్రత్యేక అధికారి శరత్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ జయశీల, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

Posted On 2026-07-25 11:36:32

Readmore >
Image 1

బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Posted On 2026-07-25 11:13:48

Readmore >
Image 1

అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమం కు ఆర్థిక సహాయం అందజేసిన పెనుమత్స సుబ్బరాజు

Posted On 2026-07-25 09:56:06

Readmore >
Image 1

సిరిసిల్లలో కమ్యూనిటీ కాంటాక్ట్... 60 వాహనాలు స్వాధీనం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల సూచన

Posted On 2026-07-25 07:31:14

Readmore >
Image 1

సాంకేతికతలో పోలీసులే ముందుండాలి...

Posted On 2026-07-25 07:07:57

Readmore >
Image 1

ప్రజల ప్రాణాలతో చెలగాటం... మల్కాజిగిరి కేక్స్ క్లబ్ బేకరీపై కేసు

Posted On 2026-07-25 07:06:03

Readmore >
Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >