డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బోరుబావుల కింద వరి సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సెక్రటేరియెట్లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, సెప్టెంబర్ నుంచి వర్షాభావం తీవ్రత పెరిగి ఎల్-నినో ప్రభావం యాసంగి వరకు కొనసాగొచ్చని హెచ్చరించారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, ప్రాజెక్టుల్లోని నీరు తాగునీటికే సరిపోతుందని తెలిపారు. వరి, పత్తికి బదులుగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని సూచించారు.
News
బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు