అన్నదానానికి ముందుకు వచ్చిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ దంపతులు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు లో శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం ఆధ్వర్యంలో పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ రోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ దంపతులు ముందుకు రావడం జరిగింది,వారికి ఆలయ సేవకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రం చంద్రశేఖర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే వారికి వంశ అభివృద్ధి జరుగుతుందని భారతీయ హిందూ సాంప్రదాయంలో తరతరాలుగా పౌర్ణిమకు ఒక ప్రత్యేక స్థానం ఉందని పౌర్ణమి చంద్రనికి విశేషమైన శక్తి కలిగి ఉండడం జరుగుతుందని,ఈ రోజున ఎవరైతే అన్నదానం చేస్తారో వారి వంశము పౌర్ణమి నాటి చంద్రుని వలె అన్ని రంగాలలో వృద్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో 450 మందికి అన్నదానం చేయడం జరిగింది. గడిచిన మూడు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రతి నెల 251/- రూపాయలు చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవత్ అనుగ్రహానికి పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.మరిన్ని వివరాలకు 9849601438 నెంబర్ కు సంప్రదించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోమకొండ శ్రీనివాస్,ఎర్రం విజయ్ కుమార్,దొంతి సుధాకర్, కస్వ వెంకన్న,ముప్పారపు రాజేందర్,కొమిరిశెట్టి దిగంబర్,మామిడి రాకేష్,శ్రీనివాస్ లు పాల్గొనడం జరిగింది.