డైలీ భారత్, కామారెడ్డి: ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న సుబ్బారావు మే 31 తో తన పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని డిప్యూటీఎస్ ఈ నరసింహారావు అన్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ యందు సుమారు 29 సంవత్సరాల పాటు ఆఫీస్ సబార్డినేటర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి శనివారం రోజున పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో పనిపట్ల శ్రద్ధ అందరితో కలివిడిగా ఉంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన సుబ్బారావు పదవి విరమణ చేయడం బాధగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఉద్యోగికి విరమణ తప్పదు అని ఆయన అన్నారు అనంతరం అధికారులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నీటి నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు
News
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు