| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి

ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి

వ్యయప్రయాసలకు గురై జిల్లా కేంద్రానికి రావద్దు

స్థానిక స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

డైలీ భారత్, కామారెడ్డి : కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్ ఇన్‌చార్జ్) ఎన్.వి. గిరి, జిల్లా పరిషత్ సీఈఓ చందర్‌లతో కలిసి వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో మొత్తం 105 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఆయా శాఖలకు సంబంధించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేస్తూ, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్‌లలో కూడా ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయా డివిజన్‌ల పరిధిలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత డివిజన్ కార్యాలయాల్లోనే సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు.

చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం అనవసరంగా వ్యయప్రయాసలకు గురై జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, స్థానిక స్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. 

అధికారులు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ప్రజావాణిలో ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Previous ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి
Next జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
ADVERTISEMENT