| Daily భారత్
Logo




ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

News

Posted on 2026-07-25 17:08:41

Share: Share


ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

కామారెడ్డి జిల్లా ఉపసర్పంచ్ ఫోరం జిల్లా కమిటీ నియామకం

ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్

డైలీ భారత్, కామారెడ్డి : ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఉప సర్పంచుల పోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ అన్నారు. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో

తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్  అధ్యక్షతన కామారెడ్డి లో జిల్లా కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వికార్ పాషా కి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్  కామారెడ్డి జిల్లా ఉపసర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షునిగా దుంపటి రాజు ను ఏకగ్రీవంగా ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు.

రంగంపేటకు చెందిన శ్రావణ్ గౌడ్ ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు.

ఆనంతరం కామారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించి నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్  మాట్లాడుతూ, ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఫోరం నిరంతరం కృషి చేస్తుందని, గ్రామీణాభివృద్ధిలో ఉపసర్పంచ్‌ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా కమిటీ సమిష్టిగా పనిచేసి రాష్ట్రంలో ఆదర్శ కమిటీగా నిలవాలని ఆకాంక్షించారు.

అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వికార్ పాషా గారు మాట్లాడుతూ, ఉపసర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ, గౌరవం మరియు గ్రామాభివృద్ధి కోసం ఫోరం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా కమిటీ రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

తర్వాత నూతన జిల్లా అధ్యక్షులు దుంపటి రాజు  మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ , రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉపసర్పంచ్‌లందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని, సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ గౌడ్  మాట్లాడుతూ, రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జిల్లా కమిటీతో సమన్వయం చేసుకుని ఉపసర్పంచ్‌ల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల ఉపసర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >
Image 1

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

Posted On 2026-07-25 15:36:10

Readmore >
Image 1

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

Posted On 2026-07-25 15:35:16

Readmore >
Image 1

సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

Posted On 2026-07-25 11:36:32

Readmore >
Image 1

బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Posted On 2026-07-25 11:13:48

Readmore >