| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

బారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు స్పష్టం..

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: విద్యార్థుల శక్తి ముందు ఎంతటి బలవంతుడైన మట్టికరువక తప్పదనే"ధర్మం "కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో రుజువువైందని నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు అన్నారు. నీట్, ఇతర ప్రవేశ పేపర్ల లేకేజీల పాపమంత కేంద్ర ప్రభుత్వ పెద్దలదేనని పేర్కొన్నారు.విద్యార్థుల శాంతియుత ఉద్యమం ముందు మోడీ ప్రభుత్వం మోకరిళ్లక తప్పలేదని ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా అస్తమానం రాజకీయ జపం చేసిన పాపాణికి లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఆవేదన అగ్రహారంగా మారి కేంద్ర మంత్రివర్గానికి గుదిబండగా మారిన వైనం విద్యార్థుల ఉద్యమానికి వన్నె తెచ్చిందని అన్నారు. ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై పెట్టిన అక్రమకేసులను ఎత్తివేసి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మధుసుధన్ రావు డిమాండ్ చేశారు.

Previous సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Next హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
ADVERTISEMENT