Posted on 2025-07-08 17:56:11
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదో టౌన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని 80 క్వాటర్స్ కు చెందిన సాలుంకే రత్నదీప్ గంజాయికి అలవాటుపడి అధిక డబ్బులు సంపాదించాలనుకున్నాడు. తెలిసిన వారి దగ్గర గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. సమాచారం తెలసుకున్న పోలీసులు డ్రైవర్స్ కాలనీలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతని వద్ద 5ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిషేధిత గంజాయిని ఎవరైనా కమిషనరేట్ పరిధిలో ఎవరైనా విక్రయించినట్టు, కొనుగోలు చేసినట్లు, దాన్ని సేవించిన వారిపై కఠిన చర్యలు తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >