| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల ధర్నా.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల ధర్నా.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

డైలీ భారత్, హైదరాబాద్: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఈరోజు  ఉదయం జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద గులాబీ పార్టీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను అడ్డుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలను గేటు బయటే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బల్దియా ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ నేతలు యత్నించారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఆందోళనకు దిగారు.

Previous దారుణ హత్య
Next హైవే మీద యాక్సిడెంట్‌.. ప్రమాదం జరిగిన వ్యాన్‌లో కనిపించిన 8కోట్ల బంగారు నగలు
ADVERTISEMENT