| Daily భారత్
Logo




హైవే మీద యాక్సిడెంట్‌.. ప్రమాదం జరిగిన వ్యాన్‌లో కనిపించిన 8కోట్ల బంగారు నగలు

News

Posted on 2025-06-28 12:28:29

Share: Share


హైవే మీద యాక్సిడెంట్‌.. ప్రమాదం జరిగిన వ్యాన్‌లో కనిపించిన 8కోట్ల బంగారు నగలు

హైవే మీద యాక్సిడెంట్‌.. ప్రమాదం జరిగిన వ్యాన్‌లో కనిపించిన 8కోట్ల బంగారు నగలు చూసి పోలీసులు కె షాక్..!..తరువాత ఏమి జరిగింది అంటే!

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: విజయవాడ నుంచి నెల్లూరు వైపుగా వెళ్తున్న ఓ బొలెరో ట్రాన్స్‌పోర్ట్‌ వాహనం.. ఒంగోలు సమీపంలో హైవేపైకి రాగానే ఎదురుగా వెళుతున్న ఓ లారీనీ ఓవర్‌ టేక్‌ చేయబోయి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో ట్రాన్స్‌పోర్ట్‌ వాహనం ముందుభాగం మొత్తం ధ్వంసం అయింది. బొలెరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

అయితే ఘటననై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఇంతకు ఆ బొలెరో వాహనంలో ఏం తరలిస్తున్నారని ఓపెన్‌ చేసి చూశారు.. అంతే ఒక్కసారిగా పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి.. వాహనంలో బాక్సుల నిండా, విలువైన బంగారు నగలు మిళ మిళ మెరుస్తూ కనిపించాయి. దీంతో బిత్తరపోయిన పోలీసులు ప్రకాశంజిల్లా ఎస్‌పి దామోదర్‌కు సమాచారం అందించారు. దీంతో వాహన వివరాలను తెలసుకోవాలని ఎస్‌పి పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఎస్‌పి దామోదర్‌ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఆ బొలేరో వాహనం ఇతర ప్రాంతాల్లోని వివిధ బంగారు నగల దుకాణాల్లో నుంచి ఆర్డర్స్‌ తీసుకొని ఆయా షాపులకు బంగారు నగలను సరఫరా చేసే సీక్వెల్‌ గ్లోబల్‌ ప్రెసీయస్‌ లాజిస్టిక్‌ కంపెనీకి చెందినది గుర్తించారు. దీంతో వాహన పత్రాలతో పాటు బంగారు నగలకు సంబంధించిన జిఎస్‌టి, ఇతర పన్నులను పత్రాలను పరిశీలన కోసం పంపించారు.

ఒంగోలు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన వాహనంలో రూ.10 కోట్ల విలువైన బంగారం బయటపడిందని తెలియగానే ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ బంగారం ఎవరిది, ఎలా తరలిస్తున్నారన్న దానిపై ఆశక్తి నెలకొంది. అయితే ఈ బంగారం అంతా లీగల్‌గానే తరలిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయినా బంగారం విలువ కోట్లలో ఉన్నందున జిఎస్‌టి పత్రాలు, ఇతర అనుమతి పత్రాలు సరిగా ఉన్నాయా… లేదా అని చెక్‌ చేశారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలితే బంగారు నగలను సంబంధిత వ్యక్తులకు అందిస్తామని ప్రకాశంజిల్లా ఎస్‌పి దామోదర్‌ తెలిపారు.

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >