| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రోడ్డు ప్రమాదంలో మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

రోడ్డు ప్రమాదంలో మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ టి.అనిల్ కుమార్ కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ వారు కోటి రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ చేతుల మీదుగా అందజేశారు.పోలీస్ శాలరీ ప్యాకేజీ అకౌంట్ ద్వారా యూనిఫాం సర్వీస్ కస్టమర్ల సంక్షేమానికి స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు ప్రవేశపెట్టిన స్కీం ద్వారా వచ్చిన నగదును అనిల్ కుమార్ గారి కుటుంబానికి ఈ రోజు అందజేశారు.ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ఎం.సత్యనారాయణ, చీఫ్ మేనేజర్ ఆంజనేయ రమేష్ మరియు బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు సమక్షంలో ఎస్పీ చేతుల మీదుగా ఈ చెక్కును అందజేశారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశానికి సేవ చేస్తున్న ధైర్యవంతులైన సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ స్కీం పోలీస్ శాఖలోని ప్రతి ఉద్యోగికి చాలా ప్రయోజనకరమని ఈ సందర్బంగా SBI బ్యాంకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.

Previous అమాయకులైన గిరిజనులపై అక్రమంగా ఫారెస్ట్ అధికారులు దాడి
Next దొంగతనం కేసులో వ్యక్తి రిమాండ్
ADVERTISEMENT