| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాచినేనిపేట రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు

మాచినేనిపేట రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంరైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో మాచినేనిపేటతండా డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు  వినతిపత్రాన్ని అందజేశారు. భూభారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకునే రైతులకు సర్వే వెంటనే చేసేలా చూడాలన్నారు. సారవంతమైన భూములను పట్టా పాస్ బుక్కులు లేక ఇబ్బంది పడుతున్న బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. ఉన్నత చదువుల కోసం కుల, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహశీల్దార్ ను కోరారు. ఈ కార్యక్రమం రైతులు తదితరులు పాల్గొన్నారు

Previous TUCI రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి :ఏదులాపురం గోపాలరావు
Next నా భర్తను బతికించండి
ADVERTISEMENT