Posted on 2025-06-20 20:45:02
TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు, పిలుపు
నిజాంబాద్ లో జూన్ 21 22 తేదీలలో జరుగుతున్న
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(TUCI) తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభల ను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లో భవన నిర్మాణ కార్మికులు అడ్డా వద్ద గోడపత్రికలను కార్మికుల తో కలసి ఆవిష్కరించారు.చండ్రుగొండ రోడ్ అటో అడ్డా వద్ద కరపత్రాలు పంచి ప్రచారం చేసిన అనంతరం గోపాలరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఈ మహాసభలలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్దేశించుకోవడం జరుగుతుందని అన్నారు.
మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరిట కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలు చేసే విధానాల వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ మహాసభల్లో చర్చించి,ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం ఎదురుకుంటున్న సమస్యలపై పోరాట కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.ఈ సభలకు తెలంగాణలో ఆటో, హమాలి, బీడీ, మున్సిపల్, భవన నిర్మాణరంగం, గ్రామపంచాయతీ మధ్యాహ్న భోజనం, మిషన్ భగీరథ, ఆశ, అంగన్వాడి, తదితర రంగాల నుండి కార్మికులు పాల్గొంటున్నారని దేశంలో సంఘటిత అసంఘటిత రంగం హక్కులను హరించకపోతున్న తరుణంలో ఈ మహాసభలు జరుగుతున్నాయని వారి తరఫున టి యు సి ఐ పోరాడుతుందని అన్నారు.కనీస వేతనాల చెల్లింపు చట్ట ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించవలసిన ప్రభుత్వాలు 12 సంవత్సరాలు నుంచి కనీస వేతనాలను జీవోలను విడుదల చేయకపోవడం దారుణమైన విషయమని వారు ఆరోపించారు, జులై 22న ప్రతినిధుల మహాసభ జరుగుతుందని ఈ ప్రతినిధుల మహాసభను ఉన్నత విద్య మండలి మాజీ చైర్మన్ ఆహ్వానసంగా అధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ప్రారంభిస్తారని వారు తెలిపారు కావున జూన్ 21 22 తేదీల్లో నిజామాబాదులో జరిగే రాష్ట్ర సభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో నాయకులు గంధం చంటి, నిమ్మటూరి మహేష్, తేజ, మంగిలాల్, దసురు, హుస్సేన్, నవీన్ నరేంద్ర అరుణ్ సర్వయ్య నర్సింహా నాయక్ పూర్ణయ్య రాంబాబు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >