Posted on 2025-06-20 20:48:06
రోజు రోజుకూ మృత్యు ఒడికి చేరుతున్న వైనం
ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయాన్ని అందించండి
అరుదైన క్యాన్సర్ తో బాధపడుతున్న నందిపాడు వాసి
అరు నెలలుగా కొనసాగుతున్న చికిత్స
దాతలు సాయం కోరుతున్న భార్య సమ్మక్క
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న తన భర్తకు చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలంటూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వేడుకుంటుంది. తన భర్తను కాపాడుకునేందుకు సాయం చేయాలంటూ ఆ రోగి భార్య సవలం సమ్మక్క కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం అశ్వారావుపేట మండలం, నందిపాడు గ్రామానికి చెందిన సవలం కాంతారావు (40) వ్యవసాయ కూలి అరు నెలల క్రితం క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం, హైదరాబాద్ లోని హాస్పిటల్లో అరు నెలలుగా
చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటికే ఉన్న పొలం భూమిని అమ్మేసి చికిత్స కోసం అప్పులు చేసి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా నయం కాలేదు.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, దాతలు ఆర్థిక సాయం చేస్తే తన భర్తను కాపాడుకుంటామని చేతులు జోడించి
అభ్యర్థిస్తున్నారు. సాయం చేయదలచిన దాతలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతా నంబరు.. 35204450325 సవలం సమ్మక్క ,ఐఎఫ్ఎస్సీ కోడ్
ఎస్ బి ఐ ఎన్ 00 13326 లో 8500917079 (సవలం సౌజన్య నెంబరుకు ఫోన్పే ద్వారా జమచేయాలని భార్య దయ హృదయము గల వారిని సామాజిక సేవా కార్యక్రమాలు చేసే వారిని ప్రజా ప్రతినిధులను రాజకీయ నాయకులను దాతలను దీన హృదయంతో అభ్యర్థిస్తోంది. దినపత్రికలో ప్రచురిస్తున్న ఈ న్యూస్ ను చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయని వారికి అందిస్తారని అభ్యర్థించడం జరుగుతుంది.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >