| Daily భారత్
Logo




విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలపై 18న చలో హైదరాబాద్ : రాష్ట్ర ప్రధానకార్యదర్శి స్వామి

News

Posted on 2025-06-15 15:26:36

Share: Share


విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలపై 18న చలో హైదరాబాద్ : రాష్ట్ర ప్రధానకార్యదర్శి స్వామి

డైలీ భారత్, మహబూబాబాద్: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్ర జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి పిలుపునిచ్చారు. మహబూబాబాద్ లో ఆదివారం ఎండి ఖదీర్ అధ్యక్షతన జరిగిన సిఐటియు అనుబంధ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సర్కిల్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో  పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని కోరారు.  వీరి సమస్యల పరిష్కారం కోసం అనేక రోజులుగా పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అందుకే ప్రభుత్వం మరియు యాజమాన్యం లో కదలికలు రావడం కోసం ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కె నాగేశ్వర్, ప్రొఫెసర్ జి హరగోపాల్, పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ప్రసాద్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంటా ఉపేందర్, తెలంగాణ ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి బి వెంకట రాజు, కొత్తగూడెం రీజినల్ అధ్యక్షులు కే శ్రీనివాస్, కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్, స్థానిక నాయకులు నీలం శ్రీనివాస్, పిల్లి వెంకటేశ్వర్లు, వీరభద్రం, అక్కినపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >