Posted on 2026-09-01 11:18:42
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ 13వ వార్డులో ప్రధాన రహదారిపై ఉన్న మ్యాన్‌హోల్ స్థానికులకు ప్రాణ సంకటంగా మారింది.
ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో ఉన్న ఈ మ్యాన్‌హోల్ సిమెంట్ మూత పూర్తిగా పగిలి లోపలికి పడిపోయింది. దీంతో రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి ఏర్పడింది. అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి సమయంలో ఈ గుంత కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అందులో పడి గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
ఎలాంటి పెద్ద ప్రమాదం జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే నూతన మ్యాన్‌హోల్ మూతను ఏర్పాటు చేయాలని శాంతి నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
#Sircilla #RajannaSircilla #Manhole #Municipal #ShanthiNagar
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >