| Daily భారత్
Logo




బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

News

Posted on 2026-08-31 16:06:18

Share: Share


బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఉదయం 10.00 గంటలకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ విక్టర్ గారు హాజరయ్యారు. డిప్యూటీ కలెక్టర్ రవి తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, ఏబీసీడీఓ చక్రధర్, బీసీ సంఘాల నాయకులు, సంచార జాతులు మరియు విముక్త జాతుల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, సంచార జాతులు, విముక్త జాతులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్యా మరియు ఉపాధి సమస్యలను వివరించారు. వారి అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ మాట్లాడుతూ, సంచార మరియు విముక్త జాతుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్య, ఉపాధి మరియు ఆర్థిక అభివృద్ధి ద్వారా సమాజంలో అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సాపా శివరాము, కొత్తపల్లి మల్లయ్య, రాజయ్య, నీల నాగరాజు, మొండి శ్రీనివాస్, నాగరాజు, మందుల శ్రీనివాస్, జనార్ధన్, లక్మణ్, లింబాద్రి, నరేష్, స్వప్న, అశ్వక్, శాంతయ్య, శ్రీకర్ తదితర బీసీ సంఘాల నాయకులు, సంచార జాతులు మరియు విముక్త జాతుల ప్రతినిధులు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >