| Daily భారత్
Logo




సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

News

Posted on 2026-09-01 08:21:35

Share: Share


సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, ఇచ్చిన హామీలను సెప్టెంబర్ 17 లోపు అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల JAC జిల్లా చైర్మన్ గజ్జెల దేవరాజు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో "ఉద్యమకారుల కోసం ఉద్యమం" నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

సిరిసిల్లలోని బి.వై. నగర్ కు చెందిన ఉద్యమకారుడు మేకల రామచంద్రం అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన విషయం తెలుసుకుని JAC ఆధ్వర్యంలో ఆయనను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ఉద్యమంలో రిలే దీక్షలు, సకల జనుల సమ్మె, వంటా వార్పులో రామచంద్రం కీలక పాత్ర పోషించారని దేవరాజు తెలిపారు.

తెలంగాణ తెచ్చిన ఉద్యమకారులే నేడు ఆర్థిక ఇబ్బందులతో జీవించడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, కేసుల ఎత్తివేత, అమరుల కుటుంబాలకు ఉద్యోగం వంటి హామీలు ఇచ్చి మూడేళ్లుగా కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో అక్కెనపెల్లి కరుణాకర్, కుసపెల్లి సరస్వతి, సింగారం దేవరాజు, కర్నె లక్ష్మీ తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.

Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >