| Daily భారత్
Logo




ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సై.. మూడు గ్రూపులుగా 59 కులాలు!

News

Posted on 2025-04-19 10:30:56

Share: Share


ఏపీలో ఎస్సీ వర్గీకరణకు సై.. మూడు గ్రూపులుగా 59 కులాలు!

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: ఏపీలో ( Andhra Pradesh) ఎస్సీ వర్గీకరణ వైపు ప్రభుత్వం స్పష్టమైన అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు ఒక కమిషన్ ఏర్పాటు చేసింది.

ఆ నివేదిక ప్రకారం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సిద్ధపడుతోంది. వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ జారీచేసింది ఏపీ ప్రభుత్వం. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. గవర్నర్ ఆమోదంతోనే ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వర్గీకరణ ద్వారా 59 ఉప కులాలకు లబ్ధి చేకూరనుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద కులాల వారిగా రిజర్వేషన్లు కేటాయించారు. 

రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని వర్గీకరణ అమలు చేస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదికను రాజీవ్ రంజన్ మిశ్రా( Rajiv Ranjan Mishra) కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు జై కొట్టిన తొలి రాష్ట్రంగా గుర్తింపు సాధించింది ఏపీ ప్రభుత్వం. దీంతో మిగతా రాష్ట్రాల్లో సైతం ఒత్తిడి పెరుగుతోంది. వీలైనంత త్వరగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

అన్ని అడ్డంకులు దాటుకొని..

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అన్ని అడ్డంకులు దాటుకొని ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర గవర్నర్( State Governor) ఆమోదంతో, న్యాయశాఖ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో వెంటనే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ 2025 అమల్లోకి వచ్చింది. కొత్త నియామకాలు, ఉద్యోగాల పదోన్నతులు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని బ్యాక్ లాగ్ పోస్టులను వర్గీకరణ ద్వారా వర్తింపజేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, కేంద్ర ఆధీనంలో ఉన్న సంస్థలకు ఇది వర్తించదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఈ వర్గీకరణ ఫలాలు అందుతాయి.

 దశాబ్దాల నిరీక్షణ తర్వాత..

ఎస్సీ వర్గీకరణ అనేది దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట. అయితే గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు( Supreme Court) ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ పై రాజ్యాంగపరమైన అధికారం ఉందని తెలిపింది. ఆయా వర్గాల వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. వెంటనే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించారు. దీనికోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజాన్ మిశ్రా నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజల నుంచి వినతులు స్వీకరించింది. ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లు, పథకాల అమలును పరిశీలించింది. ఐదు నెలల పాటు అధ్యయనం చేసిన తరువాత ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి 360 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది.

ఆ కులాలకు రిజర్వేషన్లు ఇలా..

ఏపీలో( Andhra Pradesh) ఎస్సీ వర్గీకరణ జరిగితే 59 ఉపకులాలకు లబ్ధి చేకూరనుంది. షెడ్యూల్డ్ కులాలన్నింటికీ విద్య, ఉద్యోగాల్లో సమాన హక్కులు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. 

- గ్రూప్ 1 కింద రెల్లి, ఉప కులాలుగా 12 ను చేర్చి ఒక శాతం రిజర్వేషన్, 

- గ్రూప్ 2 కింద మాదిగ, 18 కులాలను చేర్చి 6.5 రిజర్వేషన్, 

- గ్రూప్ 3 కింద మాల, 29 కులాలను చేర్చి 7.5 రిజర్వేషన్ కేటాయించారు. 

2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని వర్గీకరణ అమలు చేస్తారు. భవిష్యత్తులో జనాభా లెక్కలు మారితే.. జిల్లాను యూనిట్ గా తీసుకుని చేర్పులు మార్పులు చేస్తారు.

Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >
Image 1

మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-30 22:23:35

Readmore >
Image 1

అమ్మ చరణధూళి బిడ్డలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-30 17:58:19

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-05-30 17:55:56

Readmore >
Image 1

మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం

Posted On 2026-05-30 17:52:53

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం

Posted On 2026-05-30 17:17:48

Readmore >
Image 1

మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-05-30 17:15:14

Readmore >