| Daily భారత్
Logo




మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-05-30 18:53:35

Share: Share


మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సిరిసిల్లలో పరిశీలన.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : వైద్యులు, సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐఎంయూ, ఐసీయూ, ఎస్ఎన్ సీయూ, మెటర్నిటీ వార్డుల్లో పరిశీలించి.. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు.

 రోజు ఎంత మంది పేషెంట్లు వస్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది నిత్యం సమయానుసారంగా అందుబాటులో ఉండాలని సూచించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలని పేర్కొన్నారు.

వైద్య సేవలు ఎలా ఉన్నాయి?

ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆరా తీశారు. చిన్నారితో ఉన్న మహిళతో మాట్లాడారు. ఆసుపత్రికి ఎప్పుడు వచ్చారు? పాప ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు. 

ఉన్నత విద్యను అభ్యసించాలి

ఐఎంయూ వార్డులో చికిత్స పొందుతున్న బాలుడు, బాలికతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఏ అనారోగ్య సమస్యతో వచ్చారో.. ఆరా తీసి.. ఎక్కడి వరకు చదువుకున్నారు 

అడిగి తెలుసుకున్నారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐలో స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారు పూర్తి వివరాలతో వెళ్లి కలవాలని తెలిపారు. కోర్సుల్లో ఉచిత విద్య ఉంటుందని, మంచి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

ఈ పరిశీలనలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, వైద్యులు సంతోష్, సుమన్ మోహన్ రావు, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >
Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి

Posted On 2026-07-26 14:47:28

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం

Posted On 2026-07-26 14:40:51

Readmore >
Image 1

గాంధారి మండలంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ

Posted On 2026-07-26 14:36:26

Readmore >
Image 1

భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్

Posted On 2026-07-26 14:34:52

Readmore >
Image 1

గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

Posted On 2026-07-26 14:33:18

Readmore >