| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

ప్రభుత్వ ప్రాథమిక  పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి  ప్రభుత్వ అనుమతులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: 2026-27 విద్యా సంవత్సరానికి గాను సిరిసిల్ల మండలంలో ప్రీ ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) తరగతులను నిర్వహించుటకు సిరిసిల్ల మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 1.నెహ్రూ నగర్, 2.గోపాల్ నగర్, 3.బి.వై నగర్, 4.వెంకంపేట, 5.పద్మనగర్  6.అంబేద్కర్ నగర్ లకు ప్రభుత్వం అనుమతులను మంజూరు చేయడం జరిగిందని మండల విద్యాధికారి దూస రఘుపతి తెలిపారు. ఈ ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కొరకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ఆంగ్ల మాధ్యమంలో బోధన కొరకు ఒక ఇన్స్ట్రక్టర్ ను, ఆయాను ప్రభుత్వం నుండి నియమించడం జరుగుతుందని, అలాగే ప్రీ-ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) తరగతుల నిర్వహణ కొరకు లక్ష రూపాయల గ్రాంట్ తో వర్క్ బుక్కులు, యూనిఫామ్స్, ఆట వస్తువులు, కార్పెట్లు, ఫర్నిచర్, రీడింగ్ చైర్స్, తరగతి గది గోడలపై ఆకర్షణీమైనా బొమ్మల చిత్రీకరణ కొరకు కేటాయించబడుతుందని తెలియజేశారు. అలాగే విద్యార్థులందరికీ అల్పాహారము, మధ్యాహ్న భోజనం  అందించబడుతుందని, కావున తల్లిదండ్రులు  3 నుండి 5 సంవత్సరాల వయసుగల తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించి, ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని మండల మండల విద్యాధికారి దూస రఘుపతి ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు.

Previous మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Next "క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"
ADVERTISEMENT