పంట నష్టపోయిన రైతుకి న్యాయం చేయాలి
నకిలీ విత్తనాలు పంపిణీ చేసే సీడ్ కంపెనీలపై అధికారులు పరివేక్షణ కరువాయే
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం గ్రామంలో నకిలీ విత్తనాల మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతు పొలాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ గట్టు గూడెం గ్రామంలో దార ప్రసాద్ అనే రైతుకి ఒక సీడ్ కంపెనీ వాళ్ళు నకిలీ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి అతనిని ఆర్థికంగా నష్ట పోయేలా చేశారని వారిని కటినంగా శిక్షించాలనీ,నష్ట పోయిన పంటకు సీడ్ కంపెనీ వాళ్ళు నష్ట పరిహారం ఇస్తామని చెప్పి ఇ రోజుకి నెల దాటుతున్న ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం చేయలేదని,ఇప్పటికైన స్థానిక వ్యవసాయ అధికారులు స్పందించి రైతు పంట పొలాన్ని పరిశీలించి నష్టపోయిన రైతుకి న్యాయం అందేలా చేయాలని,నకిలీ విత్తనాలు సప్లై చేసే సీడ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని,నష్ట పోయిన రైతుకి నష్టపరిహారం చెల్లించాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగినది.