Posted on 2025-02-27 12:44:17
షాద్ నగర్ పట్టణ ముస్లిం ప్రముఖులు, నాయకులు
మున్సిపల్ కమిషనర్ సునీతకు వినతి పత్రం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మార్చు ఒకటి నుండి ప్రారంభం కాబోయే ముస్లిం ప్రజల రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని షాద్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు సంబంధిత శాఖ కృషి చేసే విధంగా సహకరించాలని పట్టణ ముస్లిం ప్రముఖులు నాయకులు స్థానిక కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం, సయ్యద్ ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, అలీం, కబీర్, జాఫర్ తదితరులు మున్సిపల్ కమిషనర్ ను గురువారం స్వయంగా కలుసుకొని రంజాన్ మాసం సందర్భంగా జన్మదిన శాఖ ఏర్పాట్ల గురించి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. నెలరోజులపాటు ఉపవాస దీక్షల సందర్భంగా మంచినీరు, వీధుల్లో విద్యుత్తు దీపాలు ఆయా ముస్లిం బస్తీలలో రోడ్ల పారిశుధ్యం తదితర అంశాలను కమిషనర్ తో చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు..
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >