| Daily భారత్
Logo




వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతోనే దేశాభివృద్ధి : ఉద్యానవన శాఖ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ రాజారెడ్డి

News

Posted on 2025-02-27 12:46:55

Share: Share


వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతోనే దేశాభివృద్ధి : ఉద్యానవన శాఖ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ రాజారెడ్డి

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతోనే దేశాభివృద్ధి

ఉద్యానవన శాఖ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ రాజారెడ్డి

రాజస్థాన్ నుండి కూరగాయలు దిగుమతి చేసుకోవడం మన దౌర్భాగ్యం

ఎన్జీవోలు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి

షాద్ నగర్ లో "శ్రీ ఫౌండేషన్"   ప్రారంభోత్సవం

హాజరైన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు "బక్కని నరసింహులు"

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు విప్లవాత్మక మార్పులతోనే దేశం సమగ్ర అభివృద్ధి చెందుతుందని ఉద్యానవన శాఖ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాజారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగస్తులు ఏర్పాటుచేసిన "శ్రీ ఫౌండేషన్" ను స్థానిక మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులుతో కలిసి ప్రారంభించారు. శ్రీ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ బి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ సమావేశానికి రైతులు రిటైర్డ్ టీఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రెండు కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం సాగుతోందని అన్నారు. ఇందులో 12.5 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో రైతులు సరైన అవగాహన లేక పంట విధానాల్లో విప్లవాత్మక మార్పులు తెలుసుకోలేక నష్టపోతున్నారని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్పందించకపోవడం, మార్కెట్ ధరల హెచ్చుతగ్గలను గమనించకపోవడం, సాంకేతిక పరిజ్ఞాన వాడుక తీరు హెచ్చుతగ్గులు కావడం తదితర అంశాలతో రైతులు అవగాహన లేక పంట విధానాల్లో రాబడిని కోల్పోతున్నారని వివరించారు. 

ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కూరగాయల పంటలు కూడా సరిగ్గా పండించలేకపోతున్నామని రాజస్థాన్ రాష్ట్రం నుండి కూరగాయలను దిగుబడి చేసుకోవడం దౌర్భాగ్యం అన్నారు. 

రాజస్థాన్లో వర్షపాతం మూడు శాతమేనని అయినా వారు సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవత్మక మార్పులతో కూరగాయల సాగును చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని వనరులు ఉన్న తెలంగాణలో రైతాంగం తెలుసుకోలేక సరిగ్గా సాగు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలతో పాటు పూల తోటల సాగు పెంపొందిస్తే రైతులు ఆర్థికంగా ఎదుగుతారని అన్నారు.

శ్రీ ఫౌండేషన్ కార్యక్రమాల్లో గ్రామీణ అభివృద్ధి వ్యవసాయం అనే అంశాలు ప్రముఖంగా ఉండడంతో వారికి అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్య వ్యవస్థ లో పోటీ తత్వం ఎక్కవై ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది అన్నారు. శ్రీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ విద్యపై అవగాహన కల్పించాలన్నారు. 

వ్యవసాయం చేయండి..  భూములు అమ్ముకోకండి - మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు

రైతాంగం వ్యవసాయం చేసుకోవాలని భూములు ఎంత మాత్రం అమ్ముకోకూడదని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు సూచించారు. శ్రీ ఫౌండేషన్ ప్రారంభోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 60 శాతం భూములు వ్యాపారస్తుల చేతిలోకి వెళ్లిపోయాయని మిగతా భూములు కూడా వారి చేతుల్లోకి వెళితే ఇక వ్యవసాయం కనుమరుగు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా అభివృద్ధికి గోవులు ప్రతీక అని అన్నారు. గోవులను రైతులు అమ్ముకోరాదని, గో సంరక్షణ సాధ్యం కాకపోతే వాటిని ఇతరులకు ఇవ్వాలని సూచించారు. సామాజిక సేవలో భాగంగా ఎవరైనా సరే పేరు కోసం సేవలు చేయవద్దని, నిజమైన సేవలు నిజాయితీగా ప్రదర్శించాలని అన్నారు. సమాజంలో పరస్పర సహకారం అనే లక్షణాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. సమాజ సేవ కోసం పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందని గుర్తింపు కోసం సమాజ సేవ చేయవద్దని అన్నారు. 

శ్రీ ఫౌండేషన్ సేవలు విస్తృతం - అధ్యక్షులు డాక్టర్ బి శ్రీనివాస్ రావు

శ్రీ ఫౌండేషన్ ద్వారా సేవలను విస్తృతం చేస్తామని ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ బి శ్రీనివాస్ రావు అన్నారు. ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ..  విద్య వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి మహిళా శక్తి చైతన్యం ఉద్యానవనం యువత స్వయం ఉపాధి కళాకారులకు ప్రోత్సాహం ఆర్థిక ప్రగతి బ్యాంకింగ్ సేవలు దివ్యాంగుల సేవా కార్యక్రమాలు పరస్పర అవగాహన ఒప్పందం పరిశోధన కమ్యూనిటీ ఔట్రిచ్ సంక్షేమం అర్బన్ హార్టికల్చర్ తదితర సేవలను శ్రీ ఫౌండేషన్ ద్వారా లక్ష్యాలను నిర్దేశించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ రవికుమార్ సెక్రటరీ డాక్టర్ బి శ్రీనివాసులు జాయింట్ సెక్రెటరీ విజయ్ కుమార్ ట్రెజరర్ డాక్టర్ బి మహేశ్వరి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వాణి రమ అశోక్ బాబు, అదేవిధంగా కొంతమంది వ్యవసాయ శాస్త్రజ్ఞులు, స్థానిక నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు..

Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >