| Daily భారత్
Logo




ఎంపీ వద్దిరాజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

News

Posted on 2025-02-27 12:31:47

Share: Share


ఎంపీ వద్దిరాజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

డైలీ భారత్, తిరుమల:ఖమ్మం జిల్లా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి కలియుగ ఇష్ట దైవం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ పుణ్య దంపతులు గురువారం ఉదయం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని గోత్ర నామాలు, భక్తిప్రపత్తులతో ప్రత్యేక పూజలు చేశారు, కొబ్బరికాయలు కొట్టారు.వేద పండితులు ఎంపీ రవిచంద్రను శాలువాతో సత్కరించి, ఆశీర్వచనాలు పలికి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అలాగే,వారు పద్మావతి, అలివేలు మంగతాయారు అమ్మ వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

తెలంగాణ సుభిక్షంగా వర్థిల్లాలి: ఎంపీ రవిచంద్ర

తెలంగాణ రాష్ట్రం  పాడిపంటలతో, ప్రజలు సుఖ సంతోషాలతో, సుభిక్షంగా వర్థిల్లాలి అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు,జనహృదయ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని, తిరిగి అధికారంలోకి రావాలని ఎంపీ వద్దిరాజు శ్రీవెంకటేశ్వర స్వామి తో పాటు పద్మావతి, అలివేలు మంగతాయారు అమ్మ వార్లను వేడుకున్నారు.

Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >