Posted on 2025-02-25 13:59:52
చైతన్యపురిలో చిన్నారులను విక్రయిస్తున్న 11 మంది అరెస్టు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా చైతన్యపురిలో చిన్నారులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మల్కాజ్ గిరి ఎస్ వోటీ సాయంతో ముఠాను పట్టుకున్న పోలీసులు... నలుగురు చిన్నారులను రక్షించి, 11 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. నిందితులు కోలా కృష్ణవేణి, దీప్తి, గౌతం సావిత్రిదేవి, శ్రవణ్ , శారదా, సంపత్ గా గుర్తించారు. పిల్లల్ని కొనుగోలు చేసిన నాగవెంకట పవన్ భగవాన్ , రమా శ్రావణి, వినయ్ కుమార్ , స్వాతి, రమేశ్ ను అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుల నుంచి 11 ఫోన్లు, 5వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీరు తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులను విక్రయించినట్లు గుర్తించామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >