Posted on 2025-02-23 08:54:07
హాజరైన మార్కెట్ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి దంపతులు, మాజీ జెడ్పిటిసి విశాల శ్రవణ్ రెడ్డి, మాజీ ఎంపిటిసి అరుణ వెంకటరెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మన షాద్ నగర్ అభివృద్ధికి ఆ రామేశ్వర శంకరుడి చల్లని కరుణ కటాక్షాలే నియోజకవర్గ ప్రగతికి సోపానాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం ఫరూక్ నగర్ మండలం రామేశ్వరం గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పరమేశ్వరుడికి అభిషేకం పూజ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు అనంతరం వేద పండితుల సమక్షంలో ఎమ్మెల్యే శంకర్ ను వేద మంత్రాలతో దీవించారు. అదేవిధంగా దేవాలయ సిబ్బంది వారు సన్మానించారు. రామేశ్వరుడి లింగాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేకంగా పూజించారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బకన్న, యాదవ్, రాయికల్ శ్రీనివాస్,అగ్గనూర్ బస్వo, రాయికల్ మోహన్ రెడ్డి,రఘు నాయక్, ఇబ్రహీం, మహిళా నాయకురాలు రమాదేవి, బాలరాజ్ గౌడ్, మురళీమోహన్ (అప్పి), మాజీ సర్పంచ్ ఆశన్న గౌడ్, మాజీ డిప్యూటీ సర్పంచ్ రతన్ నాయక్, అశోక్, నెహ్రూ నాయక్, తదితరులు పాల్గొన్నారు..
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >