| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు

ఏసీబీ వలలో అటవీ శాఖ అధికారులు

రూ 3. 5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీ కి చిక్కిన భద్రాచలం ఎఫ్ డి ఓ, డి ఆర్ ఓ 

ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీటీ రోడ్డు నిర్మాణ పనులు లో   కొన్ని చెట్లు తొలగించడం తో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డి ఓ సుజాత రూ పది లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ 3.5 లక్షలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో ఆమెను,  చర్ల ఇంచార్జ్ డి ఆర్ ఓ కృష్ణయ్య ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతం లో  రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బ తిన్నాయి ఈ ఎపిసోడ్ లో ఎఫ్ డి ఓ సుజాత పది లక్షలు డిమాండ్ చేసి భద్రాచలం కార్యాలయం లో 3.5 లక్షలు లంచం తీసుకుంటు డి ఆర్ ఓ తో పాటు పట్టుబడ్డారు.గతం లో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి మూడున్నర లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. అటవీ శాఖ లో అవినీతి పేరుకుపోయింది. ఎటువంటి సమాచారమైన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1046 కాల్ చేయాలని ఎసిబి డిఎస్పి ఉమ్మడి జిల్లాల వై రమేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు


#acb #acb Telangana #badhradri 

Previous ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Next నేడు రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు....
ADVERTISEMENT