Posted on 2026-05-07 08:39:14
డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఓ దారుణ ఘటన ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆరేళ్ల ప్రేమ, మూడేళ్ల దాంపత్య జీవితం, రెండేళ్ల చిన్నారి ఉన్నా.. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త క్షణికావేశానికి లోనై భార్యను నడిరోడ్డుపైనే కత్తితో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.
మృతురాలు 24 ఏళ్ల శిరీష కాగా, నిందితుడు ఆమె భర్త మణిదీప్. వీరిద్దరూ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని శిరీషను ప్రేమించిన మణిదీప్ పెళ్లి చేసుకుని కొంతకాలం సంతోషంగా జీవించాడు. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం.
ఇటీవల మణిదీప్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో శిరీష తన పెద్దమ్మతో కలిసి కోదాడ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అక్కడ పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి, మరుసటి రోజు మళ్లీ రావాలని సూచించారు. సమస్య చర్చల ద్వారా పరిష్కారమవుతుందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ బయటకు వచ్చిన కొద్దిసేపటికే విషాదం చోటుచేసుకుంది.
పోలీస్ స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత బస్టాండ్ సమీపంలోని టీ స్టాల్ వద్ద ఆటోలో శిరీష కూర్చొని ఉండగా, వెంట తెచ్చుకున్న కత్తితో మణిదీప్ ఆమెపై దాడి చేశాడు. ప్రజలు చూస్తుండగానే విచక్షణారహితంగా కడుపులో పొడవడంతో శిరీష తీవ్ర రక్తస్రావానికి గురైంది. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో బస్టాండ్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే ఇంత క్రూరంగా హత్య చేయడం చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఘటన అనంతరం మణిదీప్ నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి పెద్దమ్మ ఆవేదన వ్యక్తం చేస్తూ.. “నా బిడ్డకు న్యాయం జరగాలి. పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆమె కోరింది. సమస్య మాట్లాడుకుని పరిష్కారం అవుతుందని అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు” అంటూ కన్నీరుమున్నీరైంది.
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >