| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

డైలీ భారత్, సిద్దిపేట: వర్గల్ మండలం నాచారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హల్దీ వాగులో ఈతకు దిగిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఓ వివాహ వేడుక సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన పెళ్లి బృందం తూప్రాన్‌కు వెళ్లింది. అయితే వారిలో కొంతమంది యువకులు వివాహ వేడుక అనంతరం నాచారం గ్రామానికి వెళ్లారు. అక్కడ ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.

సరదాగా ఈత కొట్టేందుకు పక్కనే ఉన్న హల్దీ వాగులోకి దిగారు. వాగు లోతును సరిగా అంచనా వేయకుండా లోపలికి వెళ్లారు. దీంతో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నేడు ముగ్గురి మృతదేహాలను గుర్తించి వాగు నుంచి బయటకు తీశారు. మృతులను ప్రశాంత్, వికాస్, కొంతమి ఆనంద్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. వివాహ వేడుకకు వచ్చి మృతిచెందడంతో నవ వధూవరులు సహా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర కన్నీటిపర్యంతమయ్యారు

Previous పశ్చిమ బెంగాల్ : సువేందు అధికారి పీఏ దారుణ హత్య...
Next ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ADVERTISEMENT