Posted on 2025-02-22 16:11:41
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ నగరంలో ఈ మధ్య దారుణ హత్యలు పెరిగిపోతున్నాయి, పట్టపగలే హత్యలు జరుగుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తు న్నాయి,
అలాంటి ఘటనే శనివారం మధ్యాహ్నం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పట్టపగలే ఓ కుమారుడు తన తండ్రిని విచక్షణ రహితంగా పొడిచి చంపాడు
పోలీసుల కథనం ప్రకారం మేడ్చల్ జిల్లా కుషాయి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాప్ వద్ద తండ్రిపై కుమారుడు దారుణంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు.
బస్టాప్ వద్ద ఉన్న తండ్రిపై దాడి చేసి సుమారు ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడవ డంతో తీవ్రగాయాలయ్యా యి. వెంటనే బాధితుడిని పక్కనే ఉన్న శ్రీకర ఆసుప త్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తండ్రి మొగిలి మద్యానికి బానిసై రోజు ఇంట్లో గొడవ చేస్తు న్నాడని కుమారుడే ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.
ఇవే కాకుండా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కూడా మొగిలి హత్యకు కారణాలుగా పోలీసులు గుర్తించారు.
నిందితుడు సాయి(25) హత్య చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి, మృతుడు సికింద్రాబాద్ లాలా పేటకు చెందిన ఆర్ఎల్ మొగిలిగా, నిందితుడిని అతని కుమారుడు సాయి కుమార్గా గుర్తించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >