Posted on 2025-02-21 13:02:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నారాయణ పాఠశాలలో శుక్రవారం రోజు మహబూబ్ నగర్ జోనల్ లెవెల్ అబాకస్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీ షాద్ నగర్ మరియు వనపర్తి నారాయణ పాఠశాల విద్యార్థుల మధ్య జరిగింది. పాఠశాలలోని ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంతో ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థుల ప్రతిభను చూసి ఉపాధ్యాయులు ఎంతో అబ్బురపడ్డారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు దృవపత్రాలను అందించారు. ఒక విద్యార్థి ప్రగతి సాధించాలంటే దానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలని అన్నారు. విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికి తీసే దిశగా మరియు విద్యార్థులలో పోటీతత్వం అలవడే విధంగా విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే విధంగా పాఠశాల యాజమాన్యం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఎ.జి.యం వెంకట్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ మాధవి, కోఆర్డినేటర్స్ నితిన్ కుమార్ రెడ్డి, రీనా గుప్తా, మాధురి, ఏవో శ్రీధర్ , ఏడి నేత్ర, వైస్ ప్రిన్సిపల్ సంధ్యారాణి, అనసూయ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు..
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >