Posted on 2025-02-19 16:25:38
డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. రేఖా గుప్తాకు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఆమె రెండుస్తారు ఎన్నికయ్యారు.
ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. 48 మంది ఎమ్మెల్యేలు ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. రేఖా గుప్తాకు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఆమె రెండుస్తారు ఎన్నికయ్యారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్‌గా, తర్వాత మేయర్‌గా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో, ముఖ్యమంత్రి పదవికి రేఖ గుప్తా, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి ప్రవేశ్ వర్మ పేరును ఖరారు చేశారు. అలాగే, విజేంద్ర గుప్తాను అసెంబ్లీ స్పీకర్‌గా నియమిస్తారు.
రేఖా గుప్తాకు గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన అనుభవం లేదు. కానీ రాజకీయంగా ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. పితంపుర, షాలీమార్ బాగ్ ప్రాంత ప్రజలకు సుపరచితురాలు. స్థానికంగా పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషిచేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. రేఖాగుప్తా కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండటం ఆమెకు కలిసొచ్చింది. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు.
పితంపుర కౌన్సిలర్‌గా, షాలీమార్ బాగ్-బి నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలు. ఢిల్లీ ప్రాంతంలో పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించే నేతల్లో ఆమె ఒకరు. షాలీమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి సమీప ప్రత్యర్థి ఆప్‌కు చెందిన బందనాకుమారి చేతిలో ఓటమి చెందారు. 2025లో అదే నియోజకవర్గం నుంచి బందనాకుమారిని 29వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. రేఖాగుప్తా బీజేపీలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేయడమే ఆమెను సీఎంగా బీజేపీ ఎంపిక చేయడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >