| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన సీఐ మరియు ఇద్దరు కానిస్టేబుళ్లు

News

Posted on 2025-02-18 12:20:21

Share: Share


ఏసీబీకి చిక్కిన సీఐ మరియు ఇద్దరు కానిస్టేబుళ్లు

20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మహబూబ్‌నగర్ ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది

డైలీ భారత్, ముక్తల్: మక్తల్ సర్కిల్ సీఐ జి చంద్రశేఖర్ ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి పట్టుబడ్డారు. 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మహబూబ్‌నగర్ ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మక్తల్ పట్టణంలో శ్రీనిధి కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సంధ్యా వెంకట్ రాములు ఒక రేప్ కేసులో నిందితుడు. ఆయనకు ఇటీవలే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి సోమవారం ఆయన మక్తల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాల్సి ఉంది.

అయితే అనుకూలంగా చార్జిషీట్ వేస్తా అని చెప్పి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం నాడు 20వేలు లంచం తీసుకుంటూ శివారెడ్డి, నరసింహ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీకి దొరికిపోయారు వీరితో పాటు సిఐ చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకొని మక్తల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. వారిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.

Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >